ప్రభాస్ హారర్ సినిమాకి షాకింగ్ రన్ టైంతో ఫుటేజ్!

ప్రభాస్ హారర్ సినిమాకి షాకింగ్ రన్ టైంతో ఫుటేజ్!

Published on Aug 6, 2025 10:04 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తన కెరీర్ లో ఫస్ట్ ఎవర్ హారర్ సినిమాగా చేస్తున్న చిత్రం “ది రాజా సాబ్” కూడా ఒకటి. దర్శకుడు మారుతీతో చేస్తున్న ఈ సినిమా పట్ల కూడా ఇపుడు మంచి హైప్ నెలకొనగా చిత్ర యూనిట్ సినిమా ఆఖరి దశకి తీసుకొస్తున్నారు. అయితే ఇది వరకు తెరకెక్కించిన ఫుటేజ్ మొత్తంపై నిర్మాత రివీల్ చేసిన అంశం ఒకింత షాకింగ్ అని చెప్పాలి.

రాజా సాబ్ ఇప్పుడు వరకు రఫ్ ఫుటేజ్ ఏకంగా నాలుగున్నర గంటల పాటు వచ్చినట్టుగా తెలిపారు. దానిని రెండు గంటల నలబై ఐదు నిమిషాల నిడివికి కట్ చేయనున్నట్టుగా తెలిపారు. మరి అంత ఫుటేజ్ నుంచి ఎలాంటి సన్నివేశాలు తీసి విడుదల చేస్తారో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో టీజీ విశ్వప్రసాద్ నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు