‘ది రాజా సాబ్’ విషయంలో ఫ్యాన్స్ డిజప్పాయింట్మెంట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్ అలాగే మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ది రాజా సాబ్” కోసం తెలిసిందే. హారర్ కం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా విషయంలో ఇపుడు ఫ్యాన్స్ మాత్రం ఒకింత డిజప్పాయింట్ గా ఉన్నారని చెప్పాలి. మరి ది రాజా సాబ్ నుంచి ఈ మే మధ్యలో అప్డేట్ ఉంటుంది అని స్వయంగా మారుతినే చెప్పారు.

అయినప్పటికీ ఆ అప్డేట్ ఏంటి అనేది రాలేదు. దీనితో ఆ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఒకింత డిజప్పాయింట్ అయ్యారు. గత కొంత కాలం నుంచి టీజర్ మరియు రిలీజ్ డేట్ కోసం కూడా చూస్తున్నారు. మరి వీటి అన్నింటిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version