టింబర్ డిపోలో ప్రభాస్ యాక్షన్.. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందట!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ మూవీలో నటిస్తున్న ప్రభాస్.. దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో శరవేగంగా జరుగుతోంది.

అయితే, ఫౌజీ చిత్రంలో ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ టింబర్ డిపో సెట్‌లో ఈ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారట. ఈ సీక్వెన్స్ సినిమాలో కీలకంగా ఉండనుందని.. మాస్ ఆడియన్స్‌కు మంచి ట్రీట్ ఇవ్వనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా పరిచయం అవుతుండగా ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version