ఓటిటిలో ‘సలార్’ ప్రభంజనం వేరు..!

salaar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి బాక్సాఫీస్ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ కోసం గాని తన పొటెన్షియల్ కోసం గాని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తాను నటించిన సినిమాలు బిగ్ స్క్రీన్ మీదే కాకుండా ఓటిటిలో కూడా సెన్సేషన్ ని సెట్ చేస్తాయి. ఇలా సలార్ సినిమా కోసం మళ్ళీ హాట్ డిస్కషన్ నడుస్తుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేసిన ఈ భారీ చిత్రం థియేటర్స్ లో 700 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుంది. ఆ తర్వాత ఓటిటిలోకి వచ్చింది. అయితే ఇక్కడ మాత్రం రెండు ఓటిటిలలో సినిమా వచ్చింది.

సౌత్ భాషల్లో నెట్ ఫ్లిక్స్ కి

తెలుగు, కన్నడ సహా తమిళ్ మరియు మళయాళ భాషల్లో నెట్ ఫ్లిక్స్ కి వచ్చిన సినిమా ఏకంగా 17 మిలియన్ కి పైగా వ్యూస్ అందుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే హిందీ వెర్షన్ లేకుండా ఈ మొత్తం అంటే అది చిన్న విషయం ఖచ్చితంగా కాదు. ఎందుకంటే నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ రీచ్ చాలా పెద్దది. అయినప్పటికి సలార్ కేవలం సౌత్ భాషలతోనే ఈ రికార్డు సెట్ చేయడం విశేషం.

జియో హాట్ స్టార్ లో హిందీ.. ఇది నెవర్ బిఫోర్

సలార్ హిందీ వెర్షన్ కూడా మొదట నెట్ ఫ్లిక్స్ కే వస్తుంది అని చాలా మంది అనుకున్నారు కానీ అది జియో హాట్ స్టార్ లో వచ్చింది. అయితే జియో హాట్ స్టార్ లో సలార్ సినిమా ఊహించని ఫీట్ సెట్ చేసింది. ఇండియా వైడ్ గా టాప్ 10 ట్రెండింగ్స్ లో కంటిన్యూగా 400 రోజులకి పైగా ట్రెండ్ అయ్యిన సినిమాగా ఏ సినిమాకి లేని బిగ్గెస్ట్ రికార్డు ఓటిటిలో ఉంది.

సో సలార్ ఓటిటి రెస్పాన్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా మరో సినిమాతో కంపేర్ చేయడానికి లేదు. ఆ రేంజ్ ప్రభంజనాన్ని ఓటిటిలో ఈ సినిమా సొంతం చేసుకుంది.

Exit mobile version