పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ప్రభాస్ నటించిన ఈ బిగ్ ప్రాజెక్ట్ ఓటిటిలో విడుదల అయ్యాక ఇక్కడ కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ ని అందుకుంది. మెయిన్ గా హిందీ వెర్షన్ లో అయితే సలార్ 1 ఇప్పటికీ ట్రెండ్ అవుతూ ఉండడం విశేషం.
ఇది వరకే హాట్ స్టార్ లో ఈ చిత్రం ఏకంగా సంవత్సరం పాటుగా ట్రెండ్ లో కొనసాగి బిగ్గెస్ట్ రికార్డు సెట్ చేయగా ఇపుడు ఏకంగా 450 రోజులు పాటుగా ఇండియా వైడ్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో ఒకటిగా కొనసాగుతూ ప్రభంజనం సృష్టించిందని చెప్పాలి. మరి మొత్తానికి సలార్ హిందీ వెర్షన్ కి ఓటిటిలో ఎలాంటి ఆదరణ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.