ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న “రాధే శ్యామ్” ను పక్కన పెడితే “ఆదిపురుష్” మరియు యంగ్ డైరెక్టర్ నాగశ్విన్ తో చేపట్టిన ప్రాజెక్ట్ ఒకటి. ఈ రెండు కూడా భారీ బడ్జెట్ సినిమాలే అయినప్పటికీ పూర్తిగా కంప్లీట్ డిఫరెంట్ చిత్రాలు.
అయితే బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో ప్లాన్ చేసిన ఆదిపురుష్ కంటే ముందే నాగశ్విన్ తో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చెయ్యడంతో దానినే ప్రభాస్ అభిమానులు రాధే శ్యామ్ తర్వాత ఫిక్సయ్యిపోయారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వీరు ఎప్పటి నుంచో ఈ సినిమా విషయంలో క్లారిటీగా ఉన్నారని చెప్పాలి.
అందుకే ఎక్కడా కూడా ఇది ప్రభాస్ చేసే 21వ సినిమానే అని మెన్షన్ చెయ్యలేదు. ఇది గమనించాల్సిన అంశం. మరి ఇప్పుడు ఆదిపురుష్ టీం ఎలాగో 2022 వరకు టైం లాక్ చేసేసారు. మరి కేవలం షూటింగ్ పార్ట్ ను త్వరగా ఫినిష్ చేసేసి నాగశ్విన్ తో సినిమా మొదలు పెడతారో లేక ఆదిపురుష్ వి ఎఫ్ ఎక్స్ వర్క్ కూడా అయ్యిపోయాక ప్రభాస్ ఆ సినిమాను టేకప్ చేస్తారో అన్నది ఆసక్తిగా మారిన అంశం.