అది నిజమైతే టాలీవుడ్ క్రిష్ ప్రభాసే..!

అది నిజమైతే టాలీవుడ్ క్రిష్ ప్రభాసే..!

Published on May 15, 2020 9:04 AM IST

బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరోగా కొనసాగుతున్న సూపర్ హీరో సిరీస్ క్రిష్ సూపర్ సక్సెస్.2003లో వచ్చిన కోయీ మిల్గయా సినిమాతో మొదలైన ఈ సిరీస్ లో ఇప్పటికి మూడు పార్ట్ లు వచ్చాయి. ఓ గ్రహాంతరవాసి కారణంగా అద్భుత శక్తులు పొందిన వ్యక్తి కొడుకుగా హీరో కనిపిస్తాడు. కాగా ప్రభాస్, నాగ్ అశ్విన్ ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్ర కథపై కూడా ఓ క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ మానవునికి, దేవ కన్యకు పుట్టిన అద్భుత శక్తులు కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడట. మరి ఇదే నిజమైతే బాలీవుడ్ క్రిష్ ని పోలిన పాత్రగా ప్రభాస్ రోల్ ఉండే అవకాశం కలదు.

ఐతే ఇవన్నీ ఉహాగానాలు మాత్రమే…పూర్తి సమాచారం అందాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. నిర్మాత అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ 2022 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. మరో వైపు ప్రభాస్ దర్శకుడు రాధా కృష్ణతో పీరియాడిక్ లవ్ డ్రామా చేస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు