“ఆదిపురుష్”కు ప్రభాస్ ప్రిపరేషన్ అప్పటి నుంచే స్టార్ట్.!

“ఆదిపురుష్”కు ప్రభాస్ ప్రిపరేషన్ అప్పటి నుంచే స్టార్ట్.!

Published on Nov 5, 2020 9:00 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు మూడు భారీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న అద్భుతమైన ప్రేమ కావ్యం “రాధే శ్యామ్” చిత్రం తాలూకా షూట్ అంతిమ దశకు చేరుకుంది. అలాగే ఇప్పుడు ఇటలీ నుంచి చిత్ర యూనిట్ తిరిగి బాట పట్టి చివరి షెడ్యూల్ ను ముగించనున్నారు.

అయితే ఇక దీని తర్వాత మాత్రం ప్రభాస్ మొట్ట మొదటగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో తీయనున్న “ఆదిపురుష్” లోనే నటించున్నారు. అందుకు సంబంధించి ప్రభాస్ ఆల్రెడీ ప్లాన్డ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. రాధే శ్యామ్ అయ్యిపోయిన వెంటనే ఆ సినిమాకు కావాల్సిన బాడీ లుక్ ను ప్రభాస్ ప్రిపేర్ చెయ్యనున్నాడట.

అందుకు గాను ఒకటిన్నర నెల సమయం అలా కేటాయించుకోనున్నట్టు తెలుస్తుంది. అప్పటికి ఓంరౌత్ అడిగిన లుక్ అండ్ షేప్ ను ప్రభాస్ రెడీ చేసి అప్పుడు షూటింగ్ లోకి దిగనున్నాడట. ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా నటించనుండగా సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రలో నటిస్తున్నారు. అలాగే మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో 500 కోట్లకు పైగా వ్యయంతో 3డి లో నిర్మించనున్నారు.

తాజా వార్తలు