ప్రభాస్ కు “రాధే శ్యామ్”లో ఈ అంశంపైనే గట్టి నమ్మకం.!

ప్రభాస్ కు “రాధే శ్యామ్”లో ఈ అంశంపైనే గట్టి నమ్మకం.!

Published on Nov 3, 2020 7:02 AM IST

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం”రాధే శ్యామ్” పై మరిన్ని అంచనాలు నెలకొంటున్నాయి. అలాగే వీటితో పాటుగా ఈ మధ్య కాలంలోనే పలు ఆసక్తికరమైన విషయాలు కూడా ఈ చిత్రానికి సంబంధించి బయటకు వస్తున్నాయి. అయితే ప్రభాస్ తో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే మంచి బ్యాక్ డ్రాప్ అందులోనూ లవ్ స్టొరీ కావడంతో ఆ టైం కో ఎక్స్ పెక్టేషన్స్ ఎలా ఉండాలో అలానే మొదలయ్యాయి. కానీ తర్వాత లాంగ్ గ్యాప్ రావడంతో సినిమా ఎలా ఉంటుంది అనే ఆలోచన ఆడియెన్స్ మరియు అభిమానుల్లో కూడా ఏర్పడింది.

కానీ ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ గట్టి నమ్మకంగా ఉంది సినిమా కథ మరియు దర్శకుడు రాధా కృష్ణ టేకింగ్ మీదనే అన్నట్టు తెలుస్తుంది. అవసరమైన విజువల్స్ ను పక్కన పెడితే ఖచ్చితంగా సినిమాలోని ప్రేమ కథ ఆడియెన్స్ కు ఒక మరపురాని అనుభూతినే అందిస్తుంది అని ప్రభాస్ నమ్మకంగా ఉన్నారట. ఇప్పటికే ఫుల్ ఆన్ క్లాస్ గా అలరించిన డార్లింగ్ తాను పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు