యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘మిర్చి’ ఈ వారం భారీ విడుదలకు సిద్ధమవుతుంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, చివరికి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ సభ్యుల నుండి యూ/ఎ సర్టిఫికేట్ అందుకుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న పంచె కట్టు ఫైట్, వర్షంలో ఉండే ఫైట్ చాలా బాగా వచ్చాయని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ప్రభాస్ తండ్రిగా తమిళ నటుడు సత్యరాజ్ నటించగా తల్లిగా తమిళ్ హీరోయిన్ నదియా నటించింది. పల్నాడు నేపధ్యంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని చూపిస్తూ రెండు కుటుంబాల మధ్య వైరం మిర్చి మూల కథ అని సమాచారం. ప్రభాస్ కి జోడీగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ నటించిన ఈ సినిమాకి కొరటాల శివ దర్శకుడు.