అందాల భామ ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘చండీ’ మూవీ ఆడియో రిలీజ్ ఈ రోజు హైదరాబాద్ లో జరగనుంది. ఈ వేడుకకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు బాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ విద్యాబాలన్ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం శిల్పకళా వేదికలో జరగనుంది. ఎస్.ఆర్ శంకర్ – చిన్న కలిసి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించగా రెబల్ స్టార్ కృష్ణం రాజు, శరత్ కుమార్, నాగబాబు, వినోద్ కుమార్ లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సముద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి శ్రీను బాబు. జి నిర్మాత.