టాలీవుడ్ టాప్ స్టార్స్ ప్రభాస్ మరియు అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర పోటీపడే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రభాస్ రాధే శ్యామ్, బన్నీ పుష్ప మూవీ 2021 సమ్మర్ బరిలో దిగనున్నాయని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు వారం వ్యవధిలో లేదా ఒకే రోజు విడుదల కానున్నాయని టాక్. ఇప్పటికే 40 శాతం వరకు ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప కేరళలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
త్వరలోనే ఈ రెండు చిత్రాల షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే…బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ రెండు చిత్రాలు పోటీ పడే అవకాశం కలదు. పుష్ప మూవీతో బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కావున బాలీవుడ్ లో కూడా ప్రభాస్ రాధే శ్యామ్, బన్నీ పుష్ప తలపడే సూచన కనిపిస్తుంది. బన్నీ, ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర పోటీపడిన సందర్భాలు చాలా తక్కువ. మరి పాన్ ఇండియా చిత్రాలతో వీరి మధ్య పోటీ ఓరేంజ్ ఉండడం ఖాయం.