టాలీవుడ్ లో ప్రస్తుతం నేషనల్ స్టార్ అనగానే గుర్తుకువచ్చే హీరో ప్రభాస్. తన మార్కెట్ కి తగ్గట్లుగానే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను సెట్ చేసుకుంటూ మొత్తానికి నిజమైన పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్నాడు. పైగా ప్రభాస్ సినిమాల్లో మిగిలిన కీలక నటీనటులను కూడా పాన్ ఇండియా స్టార్లునే తీసుకుంటున్నారు. కాగా ‘ఆదిపురుష్’లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ నటించబోతుందట. ఈ వార్త నిజమే అంటూ.. బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే.
అయితే కాజోల్ గత కొంతకాలంగా రెగ్యులర్ సినిమాలకి దూరంగా ఉంటూ వస్తోంది. కానీ మధ్యలో కొన్ని సినిమాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పాత్ర వస్తే.. చేస్తోంది. అలా రఘువరన్ 2లో కూడా నటించిన సంగతి తెలిసిందే. దర్శకుడు సంజయ్ రౌత్ దర్శకత్వంలో రానున్న ఈ “ఏ- ఆది పురుష్” సినిమా దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవగణ్, అమితాబ్ లాంటి మహుమహులు నటిస్తారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.