సుశాంత్ సూసైడ్ ఎఫెక్ట్..ప్రభాస్ కి కూడా తగిలింది.

ఇక రెండు రోజులుగా ఎప్పటిలాగే ప్రభాస్ కొత్త మూవీ అప్డేట్ పై పెద్ద చర్చకు తెరలేచింది. మరో రెండు రోజులలో ప్రభాస్ 20 మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల కానున్నాయని గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఐతే ఈ మూవీ ఫస్ట్ లుక్ కొన్ని రోజుల ముందే విడుదల కావలసిందట. గత ఆదివారం హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య చేసుకొని, మరణించిన నేపథ్యంలో వాయిదా వేసుకున్నారట.

ఈనెల 22 రెండు లేదా 23లలో ప్రభాస్ 20 నుండి అప్డేట్ రావడం ఖాయం అంటున్నారు. చూద్దాం మరి ఈ సారైనా దర్శక నిర్మాతలు నిరాశ పరచకుండా చెప్పినట్లు అప్డేట్ ఇస్తారేమో. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. 1960ల కాలం నాటి పీరియాడిక్ లవ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

Exit mobile version