పవర్ స్టార్ ని లీక్ చేసి వర్మకు షాక్ ఇచ్చారు

పవర్ స్టార్ ని లీక్ చేసి వర్మకు షాక్ ఇచ్చారు

Published on Jul 22, 2020 10:37 AM IST

వర్మ లేటెస్ట్ మూవీ పవర్ స్టార్ ట్రైలర్ నేడు ఉదయం 11:00 గంటలకు విడుదల కావాల్సివుంది. వర్మ ట్రైలర్ కి 25 రూపాయలు ఛార్జ్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రైలర్ కి కూడా డబ్బులు వసూలు చేసిన నిర్మాతగా వర్మ రికార్డులకు ఎక్కాలనుకున్నాడు. ఐతే వర్మ ట్రైలర్ ముందుగానే నెట్టింట్లో హల్ చల్ చేసింది. ట్రైలర్ విడుదలకు ముందే లీకు కావడంతో వర్మ విధిలేక ట్రైలర్ ని ఫ్రీగా విడుదల చేశారు. అలాగే ట్రైలర్ కోసం డబ్బులు చెల్లించిన వారికి తిరిగి డబ్బులు చెల్లిస్తాం అన్నారు.

దీనితో వర్మ సొమ్ము చేసుకుందాం అనుకున్న ట్రైలర్ లీకై షాక్ ఇచ్చింది అని అందరూ అనుకుంటున్నారు. ఐతే ట్రైలర్ టికెట్స్ పెద్దగా అమ్ముడు కానీ పక్షంలో వర్మ ఈ లీకు నాటకం అడారేమో అనిపిస్తుంది. లేకు అనగానే జనాలు ఎగబడి చూస్తారు. ఆ విధంగా ట్రైలర్ కి భారీ వ్యూస్ దక్కే అవకాశం ఉంది. కాబట్టి కావాలనే వర్మ ఎవరితోనే పవర్ స్టార్ ట్రైలర్ లీకు చేయించాడని తెలుస్తుంది.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

తాజా వార్తలు