పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ఆయన వీటి తర్వాత హరీష శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చే ఏడాది ఆరంభానికల్లా పూర్తైపోతాయి. పవన్ 2021లో కూడా సినిమాలు చేసే ఆలోచనలో ఉండటంతో పెద్ద నిర్మాతలు ఆయన్ను అప్రోచ్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. తాజాగా డాలీ దరకత్వంలో సినిమా చేయడానికి పవన్ నుండి సానుకూల స్పందనే వచ్చిందని, అన్నీ కుదిరితే సినిమా ఓకే అయి, 2021 మధ్యలో షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
మొత్తం మీద పవన్ నుండి ఎన్నడూ లేని విధంగా వరుసగా సినిమాలు రానుండటంతో తమ హీరో ఇక సినిమాలే చేయరని నిరుత్సాహపడిన ఆయన అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక క్రిష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మొదటిసారి పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తుండటంతో అభిమానుల్లోనే కాదు ప్రేక్షకులందరిలో మంచి ఆసక్తి నెలకొంది. ఏ.ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ యేడాది ఆఖరులో విడుదలకానుంది.