త్వరలో విడుదల కానున్న పోటుగాడు ‘దేవత’ సాంగ్

Potugadu
మంచు వారబ్బాయి మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పోటుగాడు’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతోంది. మనోజ్ షూటింగ్ అయిపోగానే ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటు బిజీ బిజీ గా ఉంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో శింబు పాడిన ‘బుజ్జి పిల్ల’ పాటని ఇటీవలే రిలీజ్ చేసారు. ఆ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలోని మరో పాటని ఆగష్టు 11న రిలీజ్ చేయనున్నట్లు మనోజ్ తెలియజేశాడు. ‘ పోటుగాడు లోని ‘దేవత’ అనే లవ్ ట్రాక్ ని ఆగష్టు 11న రిలీజ్ చేస్తున్నాం. పోటుగాడు ఆల్బంలో ఇదినాకు బాగా ఇష్టమైన సాంగ్’ అని మంచు మనోజ్ ట్వీట్ చేసాడు.

పవన్ వడయార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి అచ్చు మ్యూజిక్ అందిస్తున్నాడు. నలుగురు హీరోయిన్స్ ఉండనున్న ఈ సినిమాని రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

Exit mobile version