ట్విట్టర్ బాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సెలబ్రిటీలు

ట్విట్టర్ బాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సెలబ్రిటీలు

Published on Aug 21, 2012 9:16 PM IST


నేరపరమైన ట్వీట్స్ కి ట్విట్టర్ వారు సెన్సార్ షిప్ ఇవ్వకపోవడంతో భారత ప్రభుత్వం ట్విట్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతోంది. ఇప్పటివరకూ ట్విట్టర్ కి సంభందించిన ఎలాంటి ఆఫీసు ఇండియాలో లేకపోవడం మరియు సెన్సార్ షిప్ విషయంగా గవర్నమెంట్ ఇచ్చిన నోటీసులకు ట్విట్టర్ సిబ్బంది జవాబు ఇవ్వకపోవడంతో ఈ విషయం పై న్యూ ఢిల్లీ అధిష్టానం కోపంగా ఉంది. అందువల్ల భారత ప్రభుత్వం ట్విట్టర్ ని నిరోదించడానికి చూస్తోంది మరియు దీని కోసం యు.ఎస్ లోని హోంల్యాండ్ డిపార్ట్ మెంట్ సహాయంతో కూడా ట్విట్టర్ వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. ట్విట్టర్ ని బాన్ చేస్తాము అన్న వార్త దేశంలోని చాలా మంది ప్రముఖులకు ఆగ్రహం తెప్పించింది. ఇలాంటి విషయాల్లో ఎంతో చురుకుగా పాల్గొనే సిద్దార్థ్ కూడా ఈ విషయం పై కొంచెం ఘాటుగానే స్పందించారు. వాక్ స్వాతంత్ర్యం అనేది రాజ్యాగం మనకిచ్చిన ప్రాధమిక హక్కు కనుక మన గవర్నమెంట్ అలా చెయ్యదు అని భావించాలి.

తాజా వార్తలు