‘అవును’ సినిమా విడుదలై విజయం సాదించిన రెండు నెల తర్వాత పూర్ణ మరో తెలుగు సినిమాలో నటించడానికి అంగీకరించారు. కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటించిన ”సీమ టపాకాయ్’ సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయమైన ఈ భామ ‘అవును’ సినమాలో తన నటనకి అందరి ప్రశంశలు అందుకుంది. ఎం.ఎస్ రాజు నిర్మించబోయే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో త్రిష ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో త్రిషతో పాటు పూర్ణ కూడా తెర పంచుకోనుంది. పూర్ణ చేస్తున్న మొదటి బిగ్ ప్రాజెక్ట్ ఇదే. ఈ చిత్ర మిగతా విశేషాలను త్వరలోనే తెలియజేయనున్నారు.
ఇప్పటి వరకూ ఎం.ఎస్ రాజు నిర్మాతగా ‘మనసనతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’ మరియు నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సూపర్ హిట్ చిత్రాలను తీసాడు. అలాగే దర్శకుడిగా మారి ‘వాన’, ‘తూనీగ తూనీగ’ సినిమాలు తీసాడు. ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో అయినా ఎం.ఎస్ రాజు తన హిట్ ట్రాక్ లోకి వస్తాడేమో కాలమే నిర్ణయించాలి.