పూలరంగడు ఆడియో మరియు సినిమా విడుదల తేదీలు ఖరారు


కామెడీ హీరో సునీల్ యాక్షన్ హీరోగా మారి నటిస్తున్న చిత్రం ‘పూలరంగడు’. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 9న విడుదల కాబోతుంది. ఈ చిత్రం మొదట సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడి జనవరి 26న లేదంటే ఫెబ్రవరి మొదటి వారంలో విడుదలవుతుంది. సునీల్, ఇషా చావ్లా ముఖ్య పాత్రలు పోషిస్తుండగా వీరభద్రం దర్శకత్వం వహిస్తున్నారు. మాక్స్ ఇండియా బ్యానర్ పై కె. అచ్చి రెడ్డి నిర్మిస్తున్నారు. సునీల్ ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ బాడీతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతున్నాడు.

Exit mobile version