“పూల రంగడు” చిత్రానికి సానుకూల స్పందన

“పూల రంగడు” చిత్రానికి సానుకూల స్పందన

Published on Feb 18, 2012 8:00 PM IST

సునీల్ మరియు ఇషా చావ్లా ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “పూల రంగడు” ఈరోజు రాష్ట్రమంతట విడుదల అయ్యింది. ఈ చిత్రం విడుదల అయ్యిన అన్ని కేంద్రాల నుండి చాలా మంచి స్పందన వచ్చింది. చిత్రం లో సునీల్ ఆహార్యం మరియు డాన్స్ చిత్రానికి మంచి విమర్శలను రాబట్టాయి. దీనికి ఇషా చావ్లా అందం తోడు కావటం తో చిత్రం విజయం వైపు పరుగు తీస్తుంది. ఈ చిత్రం ఈరోజు రాష్ట్రం అంతట 450 కేంద్రాలలో విడుదల అయ్యింది గతం లో “మర్యాద రామన్న” మరియు “అందాల రాముడు” చిత్రాల విజయాలతో ఉన్న సునీల్ మరో విజయాన్ని తన ఖాతా లో చేర్చుకున్నారు. ఈ చిత్రానికి వీరభద్రమ్ దర్శకత్వం వహించారు. కే.అచ్చి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

తాజా వార్తలు