‘పూజా హెగ్డే’ పవన్ స్టార్ సినిమాలో నటిస్తోందా ?

‘పూజా హెగ్డే’ పవన్ స్టార్ సినిమాలో నటిస్తోందా ?

Published on Mar 22, 2020 12:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 28వ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. దాంతో ఇప్పుడు హరీష్ – పవన్ చేయబోతున్న సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రంలో కథానాయకిగా పూజా హెగ్డే నటించవచ్చే అవకాశం ఉందట.

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’తో క్రిష్ సినిమా కూడా చేస్తున్నాడు. క్రిష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మొదటిసారి పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తుండటంతో అభిమానుల్లోనే కాదు ప్రేక్షకులందరిలో మంచి ఆసక్తి నెలకొంది. ఏ.ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ యేడాది ఆఖరులో విడుదలకానుంది. ఈ సినిమా పూర్తవగానే హరీష్ శంకర్ చిత్రం మొదలుకానుంది.

తాజా వార్తలు