స్వీయ గృహ నిర్బంధంలో ‘పూజా హెగ్డే’ !

స్వీయ గృహ నిర్బంధంలో ‘పూజా హెగ్డే’ !

Published on Mar 19, 2020 5:27 PM IST

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. రోజురోజుకి కరోనా బాధితులు ఎక్కువైపోతున్నారు. సామన్య ప్రజానీకం దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ కరోనా దెబ్బకు ఇల్లు దాటాలంటేనే పదిసార్లు ఆలోచిస్తున్నారు. పైగా విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశించాయి. దాంతో విదేశాల నుండి వచ్చిన వారంతా ఇంట్లోనే ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ‘పూజా హెగ్డే’ కూడా 14 రోజుల పాటు ఇంటిలోనే ఉండిపోనుంది. ప్రభాస్ జాన్ షూటింగ్ కోసం జార్జియా వెళ్లిన పూజ.. ఇంటికి వచ్చిన వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయింది అట. కరోనా విషయంలో అన్ని ప్రభుత్వాలతో పాటు అన్ని సంస్థలు మరింత అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే భద్రతా చర్యలతో పాటు కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకువెళ్తున్నారు.

తాజా వార్తలు