పూజ హెగ్డేను మెచ్చుకున్న విజయ్ కుమార్ కొండ

పూజ హెగ్డేను మెచ్చుకున్న విజయ్ కుమార్ కొండ

Published on Mar 2, 2014 2:30 PM IST

pooja-hegde
మంగళూరు బ్యూటీ పూజ హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. తమిళ హీరో జీవా నటించిన మాస్క్ సినిమాతో పరిచయమైన ఈ భామ తెలుగులో నాగ చైతన్య నటిస్తున్న ‘ఒక లైలా కోసం’ సినిమాలో నటిస్తోంది. విజయ్ కుమార్ కొండ ఈ మూవీకి డైరెక్టర్.

మాకు అందిన రిపోర్ట్స్ ప్రకారం పూజా హెగ్డేకి సినిమా సెట్స్ పైకి వెళ్ళక ముందే బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ‘ తెలుగులో డైలాగ్స్ చెప్పడానికి పూజ బాగా ఇబ్బంది పడుతుందని అనుకున్నాం. కానీ పూజా చాలా ప్రొఫెషనల్ యాక్టర్. తను ప్రతి డైలాగ్ ని అర్థం చేసుకొని చేస్తోంది. తన పాత్ర కోసం మూడు నెలలు ట్రైనింగ్ కూడా తీసుకుందని’ విజయ్ కుమార్ కొండ తెలిపారు. ఇప్పటికే పూజ తన పార్ట్ షూటింగ్ ని దాదాపు పూర్తి చేసింది.

పూజ హెగ్డే ఈ సినిమాలోనే కాకుండా వరుణ్ తేజ్ హీరోగా నటించనున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటించనుంది. శ్రీ కాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మార్చ్ 15 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజా వార్తలు