మరో సౌత్ సినిమా పట్టేసిన పూజా హెగ్డే..?

మరో సౌత్ సినిమా పట్టేసిన పూజా హెగ్డే..?

Published on Nov 4, 2025 2:00 AM IST

Pooja-Hegde

అందాల భామ పూజా హెగ్డే గతంలో స్టార్ హీరోయిన్‌గా వరుస అవకాశాలను అందుకుని సక్సెస్ అయ్యింది. ఇక కెరీర్ టాప్‌లో ఉన్న టైమ్‌లో బాలీవుడ్ పై మక్కువతో ఇక్కడి సినిమాలకు నెమ్మదిగా దూరం అయ్యింది. అయితే, అక్కడ కూడా ఆమెకు ఆశించిన స్థాయిలో సక్సెస్ రాకపోవడం.. సౌత్‌లో ఛాన్స్‌లు తక్కువ కావడంతో పూజా కెరీర్ డల్ అయ్యింది.

అయితే, ఇప్పుడు ఆమె సౌత్‌లో మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ వరుస సినిమాలను లైనప్ చేస్తోంది. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ‘జన నాయగన్’లో హీరోయిన్‌గా నటిస్తున్న పూజా, దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ మూవీలోనూ నటిస్తోంది. అయితే, రీసెంట్‌గా రాఘవ లారెన్స్ నటిస్తున్న ‘కాంచన-4’లో కూడా ఈ బుట్టబొమ్మ హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది.

కాగా, ఇప్పుడు మరో హీరో ధనుష్ నెక్స్ట్ చిత్రంలో కూడా పూజా ఛాన్స్ కొట్టేసినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘అమరన్’ ఫేం రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో పూజా ఎలాంటి రోల్ పట్టేస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా వరుస ఛాన్స్‌లు దక్కించుకుంటున్న ఈ బ్యూటీ, తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

తాజా వార్తలు