దర్శక నిర్మాతలను ఇరకాటంలో పడేస్తున్న పవన్ తీరు

దర్శక నిర్మాతలను ఇరకాటంలో పడేస్తున్న పవన్ తీరు

Published on Feb 22, 2020 6:44 PM IST

పవన్ రాజకీయ కార్యకలాపాలు, పర్యటనలు దర్శక నిర్మాతలకు ఒకింత ఇబ్బందిగా మారాయట. అనుకున్న షెడ్యూల్ కి అనేక మార్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందట. పవన్ పొలిటికల్ షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి నడుస్తుందని ఇండస్ట్రీ టాక్. ఐతే పవన్ ఈ సినిమాలకు కమిట్ అయ్యే ముందే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని వివరించడంతో ఇప్పుడు దర్శక నిర్మాతలు నోరు ఎత్తలేని పరిస్థితి నెలకొందని తెలుస్తున్న సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలకు కమిటై ఉన్నారు.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న పింక్ రీమేక్ మరో రెండు నెలలో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ షూటింగ్ కూడా మరోప్రక్క నడుస్తుంది. ఇక దర్శకుడు హరీష్ శంకర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. 2020లోనే పవన్ నుండి రెండు సినిమాలు వచ్చే అవకాశం కలదు.

తాజా వార్తలు