మన తెలుగు ఆడియెన్స్ కి మంచి క్రేజీ థ్రిల్లింగ్ ట్రీట్ ని అందించిన పలు చిత్రాల్లో సత్యం రాజేష్ నటించిన సూపర్ నాచురల్ థ్రిల్లర్ చిత్రం ‘పొలిమేర’ కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు అనీల్ విశ్వనాధ్ తెరకెక్కించగా తన నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రమే ’28 డిగ్రీ సెల్సియస్’. యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర నటించిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల అయ్యింది.
అయితే పొలిమేర రేంజ్ లో ఆడియెన్స్ ని థ్రిల్ చేయలేకపోయింది కానీ సోసోగా మాత్రమే ట్రీట్ అందించింది. ఇక ఈ చిత్రం ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. మరి ఈ చిత్రాన్ని చూడాలి అనుకుంటే మా సమీక్ష చూసి ఒక నిర్ణయానికి రావచ్చు.