టాలీవుడ్ ప్రముఖ కథా రచయిత చిన్నికృష్ణ మీద ఎస్.ఆర్ నగర్ పోలిస్ స్టేషన్లో కేసు నమోదైంది. తన తోటి కథా రచయిత అయిన సిరిపురం కిరణ్ ని రెమ్యూనరేషన్ కి సంభందించిన విషయంలో చిన్నికృష్ణ తన మీద చెయ్యి చేసుకున్నారనే కారణంతో చిన్నికృష్ణ పై అధికారికంగా కిరణ్ కేసు పెట్టారు. ఈ విషయం గురించి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ విషయం మీద చిన్ని కృష్ణ ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన ఇవ్వలేదు. ఈ విషయాన్ని గురించి పోలీసులు కూడా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వడంలేదు.