హర హర మహాదేవ్ క్రియేషన్స్ ప్రజెంట్స్ ‘ప్లే’ చిత్రాన్ని మోక్ష్ దర్శకత్వం వహించగా రాజ సులోచన.ఎన్ నిర్మించారు. పది కథలు ఒక రాత్రిలో జరిగే సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతొంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ మోక్ష్ మాట్లాడుతూ… ‘అందరికి నమస్కారం. ప్లే అనేది డిఫరెంట్ సినిమా, ఒక రాత్రి జరిగిన కథ ఇది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సపోర్ట్ చేస్తున్న మీడియాకు ధన్యవాదాలు. మా సినిమాను అందరూ ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ కష్టపడి పని చేశారు, మాకు సహకరించిన అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఫిబ్రవరి 28న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నాము, మా సినిమాను ఆదరించి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.
హీరో అభినవ్ సింగ్ మాట్లాడుతూ… ‘నాకు ఇది మొదటి సినిమా, ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమా మీ అందరికి నచ్చుతుంది. డైరెక్టర్ గారు సినిమాను ప్రెజెంట్ చేసిన విధానం బాగుంటుంది.