పిజ్జాకి నాగబాబు, శివాజీ డబ్బింగ్


తమిళ్లో వచ్చిన పిజ్జా సినిమా చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతి రమ్య నంబీసన్ ప్రధాన పాత్రల్లో కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకి చాలా మంది ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకుంది. యువ హీరో సిద్ధార్థ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా ఫస్టాఫ్ చూడగానే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. ఫుల్ సినిమా చూసాక కూడా ఫీల్ అయ్యాను. పిజ్జా చాలా మంచి సినిమా. ప్రముఖ తమిళ నిర్మాత, నటుడు ఉధయనిది స్టాలిన్, నటి స్నేహ ప్రసన్న ఇలా చాలా మంది అభినందలతో ముంచెత్తారు. ఇంత మంది మెచ్చుకుని ప్రేక్షకుల మనసును గెలుచుకున్న ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో డబ్ చేయబోతున్నారు. ఈ సినిమాకి అందరికీ తెలుగు వారితోనే డబ్బింగ్ చెప్పిస్తున్నారు. ఈ సినిమాలోని పిజ్జా ఓనర్ పాత్రకి నాగబాబు చేత డబ్బింగ్ చెప్పించారు. హీరో విజయ్ పాత్రకు గాను హీరో శివాజీ డబ్బింగ్ చెప్పాడు. వీరిద్దరి డబ్బింగ్ సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని నిర్మాత సురేష్ కొండేటి భావిస్తున్నారు.

Exit mobile version