నాచురల్ స్టార్ నాని ఇపుడు సాలిడ్ హిట్ స్ట్రీక్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అలా నాని నుంచి నెక్స్ట్ రాబోతున్న చిత్రమే “ది ప్యారడైజ్”. భారీ అంచనాలు నడుమ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ మంచి ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకి నాని ఒక ఊహించని మేకోవర్ ని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. మరి దీనికోసం నాని ఒక మ్యాచో లుక్ లోకి కూడా మారుతున్న సంగతి తెలిసిందే.
ఇలా ఓ లేటెస్ట్ పిక్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జిమ్ లో చెమట కక్కుతూ నాని వదిలిన కిల్లింగ్ లుక్ ఇపుడు ఫ్యాన్స్ ని కేజ్రీగా మార్చింది. ఇలా తన స్టన్నింగ్ పిక్ సోషల్ మీడియాలో సహా సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. మరి ప్యారడైజ్ లో నాని ఎలా ఆశ్చర్యపరుస్తాడో వేచి చూడాలి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.