మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసం అందరికీ తెలిసిందే. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేస్తున్న ఈ పాన్ వరల్డ్ అడ్వెంచర్ చిత్రాన్ని మేకర్స్ ఒక గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిస్తున్నారు. మరి రీసెంట్ గా మహేష్ పుట్టినరోజు కానుకగా వచ్చిన బిగ్ ట్రీట్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తే మహేష్ బాబు మాత్రం తన అభిమానులు అందించిన స్పెషల్ గిఫ్ట్ తో థ్రిల్ అయ్యాడని చెప్పాలి.
ఈ 50వ పుట్టినరోజు కోసం విష్ ఎస్ ఎస్ ఎం బి అంటూ క్రియేట్ చేసిన ఒక కొత్త చారిటీ ప్రయత్నం మహేష్ బాబుని ఎంతో మెప్పించింది అని ఎస్ ఎస్ కార్తికేయ ఓ పిక్ షేర్ చేసి తెలిపాడు. దీనితో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో మహేష్ బాబు అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ బిగ్ ప్రాజెక్ట్ నుంచి ఈ నవంబర్ లో అసలు ట్రీట్ రానున్న సంగతి తెలిసిందే. దీని పట్ల భారీ హైప్ ప్రస్తుతం నెలకొంది.