పిక్ ఆఫ్ ది డే : తెలంగాణ గద్దర్ అవార్డ్స్‌లో ఒకే ఫ్రేమ్‌లో సీఎం రేవంత్ రెడ్డి, నందమూరి బాలకృష్ణ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

పిక్ ఆఫ్ ది డే : తెలంగాణ గద్దర్ అవార్డ్స్‌లో ఒకే ఫ్రేమ్‌లో సీఎం రేవంత్ రెడ్డి, నందమూరి బాలకృష్ణ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Published on Jun 14, 2025 9:06 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ ప్రదానోత్సవ వేడుక హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుకకు యావత్ సినీ పరిశ్రమ తరలి వెళ్లింది. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ అవార్డుల వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఇక ఈ వేడుకలో నందమూరి బాలకృష్ణ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పక్కపక్కన కూర్చుని చాలా సరదాగా ముచ్చటించారు. వారి పక్కన సీఎం రేవంత్ రెడ్డి కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా ముగ్గురు కలిసి ఉన్న ఈ ఫోటోను అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.

కాగా, పుష్ప చిత్రానికి బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్ ఎంపికైన సంగతి తెలిసిందే. దాదాపు 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ అవార్డుల ప్రదానోత్సవం తో సినీ పరిశ్రమకు చెందిన పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు