త్వరలో “దళం” చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రానున్న పియా బాజ్పాయి మరో చిత్రానికి సంతకం చేసింది. మధుర శ్రీధర్ దర్శకత్వంలో రానున్న “బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ” అనే ద్విభాషా చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషించనుంది. స్వాతి ఈ చిత్రంలో నటిస్తున్నారు అని వార్తలు వినిపిచాయి కాని చిత్రీకరణ మొదలు పెట్టుకోకముందే ఆమె స్థానంలో పియా బాజ్పాయి వచ్చి చేరింది. అర్చన కవి మరో పాత్రలో కనిపించనుంది. మహాత్ రాఘవేంద్ర ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు. వైజాగ్లో ఈ చిత్ర రెండవ షెడ్యూల్ ఈ మధ్యనే మొదలయ్యింది ఈ షెడ్యూల్ లో ప్రధాన తారల మధ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పి జి విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డా ఎంవికేరెడ్డి ఈ చిత్రాన్ని షిరిడి సాయి కంబైన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా త్వరలో విడుదల అయ్యే “దళం” చిత్రం మీద పియా బాజ్పాయి చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. నవీన్ చంద్ర, పియా బాజ్పాయి మరియు కిషోర్ ప్రధాన పాత్రలలో రానున్న ఈ చిత్రానికి పరిశ్రమలో మంచి టాక్ ఉంది. డిసెంబర్లో ఈ చిత్రం విడుదల కానుంది.