టాలీవుడ్ హాస్యబ్రహ్మ డా. బ్రహ్మానందం సినిమా చూస్తేనే కాదు.. ఆయన ఫోటో చూసినా నవ్వకుండా ఉండలేదు. అలాంటిది ఆయన్ను ప్రత్యక్షంగా కలుసుకోవడానికి చాలా మంది సెలబ్రిటీలు క్యూ కడుతుంటారు. తాజాగా ఈ లెజెండరీ కమెడియన్‌ను కలిశాడు మరో కమెడియన్ యోగిబాబు.
తమిళ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్‌గా యోగిబాబు ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. ఇక ఇప్పుడు ఆయన టాలీవుడ్లో నేరుగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపి రెడ్డి’ రిలీజ్‌కు రెడీ అయింది. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ కామెడీ చిత్రంలో యోగిబాబుతో పాటు బ్రహ్మానందం కూడా నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా వీరిద్దరు రీసెంట్గా ఒకే స్టేజీపై కనిపించారు.
ఇక తాజాగా యోగిబాబుని బ్రహ్మానందం తన ఇంటికి పిలిపించుకున్నారు. సరదాగా కాసేపు ముచ్చటించిన వారు ఇలా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలను చూస్తుంటే నవ్వు రెట్టింపు అవుతుందని కామెడీ లవర్స్ కామెంట్ చేస్తున్నారు.