ఫోటో మూమెంట్: మెగా బ్రదర్స్ తో నిహారిక రాఖీ సెలబ్రేషన్స్

ఫోటో మూమెంట్: మెగా బ్రదర్స్ తో నిహారిక రాఖీ సెలబ్రేషన్స్

Published on Aug 9, 2025 2:37 PM IST

ప్రస్తుతం మెగా హీరోలు తమ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలతో బిజీగా ఉన్న తరుణంలో రాఖీ పండుగ కూడా రానే వచ్చింది. మరి ఈ పండుగ కానుకగా మెగా డాటర్ నిహారిక కొణిదెల షేర్ చేసిన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారాయి.

తన సొంత అన్న మెగా ప్రిన్స్ వరుణ్ రేజ్ సహా పెద్దనాన్న మెగాస్టార్ తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లతో ఈ రాఖి పండుగ జరుపుకున్నట్టుగా షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ రాఖి పండుగకి ఎక్స్ట్రా లవ్ ని ఫీల్ అవుతున్నానని తెలిపింది.

దీనితో ఇవి చూసిన అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ తన భారీ చిత్రం పెద్ది చేస్తుండగా వరుణ్ తేజ్ తన కెరీర్ 15వ సినిమాగా చేస్తున్నారు. వీటిపై ప్రస్తుతం మంచి బజ్ నెలకొంది.

తాజా వార్తలు