రీసెంట్ గా మన టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో బ్యూటిఫుల్ చిత్రం 8 వసంతాలు కూడా ఒకటి. మొదటి నుంచి కూడా కొంచెం ప్రత్యేకంగా తీసుకున్న ఈ సినిమాని దర్శకుడు ఫణి నర్శెట్టి దర్శకత్వం వహించగా అనంతిక ప్రధాన పాత్రలో నటించింది.
అయితే విడుదలకి ముందు తర్వాత కూడా కొన్ని కాంట్రవర్సీలు ఎదుర్కొన్న ఈ సినిమా ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా ఓటిటి హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఇందులో నేటి నుంచి సినిమా అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ తెలుగు సహా ఇతర సౌత్ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూడాలి అనుకునేవారు నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి