టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రెడ్”. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న తన అభిమానులకు రాబోయే తన పుట్టిన రోజు వేడుకలు ఏమీ జరపవద్దని రామ్ సూచించారు. అయితే అదే అభిమానులకు రేపు మే 15 తన పుట్టిన రోజు సందర్భంగా ఓ మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే సంగీత బ్రహ్మ మణిశర్మ రామ్ కు ఇచ్చిన ప్రతీ ట్రాక్ మంచి హిట్ అయ్యింది.
అలా ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ లవ్ ట్రాక్ మంచి ఆదరణ అందుకోగా రాబోయే తన పుట్టిన రోజున ఒక మాస్ సాంగ్ తో ట్రీట్ ఇవ్వబోతున్నట్టుగా చిత్ర బృందం తెలిపారు. “డించక్” అనే టైటిల్ తో ఉన్న ఈ పాటను ఈ మే 15న ఉదయం 10 గంటలకు విడుదల చెయ్యబోతున్నట్టుగా చిత్ర బృందం తెలిపారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. మరి ఈ మాస్ ట్రీట్ ఎలా ఉందో తెలియాలి అంటే విడుదల వరకు ఆగక తప్పదు.