సోనూ సూద్ వద్దకు వెళితే సహాయం దొరికినట్టే అని నమ్ముతున్నారు

సోనూ సూద్ వద్దకు వెళితే సహాయం దొరికినట్టే అని నమ్ముతున్నారు

Published on Nov 5, 2020 1:58 AM IST

నటుడు సొనూసూద్ కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలకు ఎంతగానో సేవ చేశారు. ప్రధానంగా పొరుగు రాష్ట్రాల్లో ఇరుక్కుపోయి, సొంత ఊళ్లకు వెళ్లలేక, పనులు లేక అనేక అవస్థలు పడుతున్న వందల మంది కూలీలను సొంత ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేసి ఇళ్లకు చేర్చారు సొనూసూద్. అంతేకాదు ఉద్యోగాలు లేక కష్టాల్లో ఉన్నవారు, ఆకలి బాధలు పడుతున్నవారు ఇలా ఎంతో మందికి సోనూసూద్ సహాయం అందింది. సోషల్ మీడియాలో ఇదిగో పలానా చోట పలానా మనిషి కష్టాల్లో ఉన్నాడు అంటూ సందేశం పంపితే ఇదిగో నేనున్నాను అంటూ గంటల వ్యవధిలో సహాయం చేసేవారు సోనూసూద్.

కష్టకాలంలో ఆయన చూపిన సేవా దృక్పథానికి యావత్ దేశం ఆయన్ను అభినందించింది. ఆన్ స్క్రీన్ విలన్ పాత్రలు చేసే సోనూసూద్ నిజజీవితంలో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నారు అంటూ కితాబిచ్చారు అందరూ. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడ సోనూ సహాయం పొందిన వాళ్ళు ఉన్నారు. దీంతో కష్టాల్లో ఉన్నవారు సోనూ వద్దకు వెళితే తప్పకుండా సహాయం దక్కుతుందనే నమ్మకానికి వచ్చేశారు. అందుకే హైదరాబాద్లో ‘అల్లుడు అదుర్స్’ షూటింగ్లో ఉన్న ఆయన్ను జనం వెతుక్కుంటూ వెళ్లి కష్టాలు చెప్పుకుంటున్నారు. సోనూ సైతం సహాయార్థం వచ్చిన వారి అవసరాలను ఓపిగ్గా వింటూ తనకు చేతనైన సహాయం చేస్తానని హామీ ఇస్తున్నారు.

తాజా వార్తలు