ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : మే 22, 2025
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : విజయ్ బాబు, అనుమోల్, దేవకి రాజేంద్రన్, ప్రకాష్ బారె, అమల్ దేవ్ తదితరులు
దర్శకత్వం : రెజిన్ ఎస్ బాబు
నిర్మాతలు : డానిష్ కె.అశోకన్, లిషా జోసెఫ్, బినోజ్ విల్యా, మిథున్స్ మనీ మార్కెట్
సంగీతం : జీన్ పి.జాన్సన్
సినిమాటోగ్రఫీ : అరుణ్ దామోదరణ్
ఎడిటింగ్ : సూరజ్ ఈ.ఎస్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మలయాళంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘పెండ్యులం’. 2023లో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఈటీవీ విన్లో తెలుగు డబ్బింగ్లో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
మహేష్ నారాయణ్ (విజయ్ బాబు) ఓ డాక్టర్. తన భార్య శ్వేత(దేవకి రాజేంద్రన్) కూతురు తన్మయి(ఆవని)తో కలిసి ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు షిఫ్ట్ అవుతాడు. మహేష్ నారాయణ్ తన ఫ్యామిలీతో కలిసి ఓ రోజు ట్రిప్‌కు వెళ్తాడు. అక్కడ అనుకోని విధంగా మహేష్ నారాయణ్‌కు యాక్సిడెంట్ అవుతుంది. అయితే, అతనికి జరిగిన యాక్సిడెంట్ కలలో అని తెలుసుకుని అవాక్కవుతాడు. ఇంతకీ మహేష్ నారాయణ్‌కు వచ్చిన కల ఏమిటి..? అందులో అతడు ఎవరెవరిని కలుస్తాడు..? అతనికి ఈ కల పదేపదే ఎందుకు వస్తుంది..? అతను ఈ కలలో ఎలాంటి విషయాలను తెలుసుకుంటాడు..? చివరికి ఏం జరిగింది..? అనేది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
మిస్టరీ థ్రిల్లర్ కథలకు కావాల్సిన థ్రిల్లింగ్ అంశాలు ఈ సినిమాలో మనకు కనిపిస్తాయి. ఇది ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచుతూ ఉంటుంది. ఇక దర్శకుడు కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లిన తీరు బాగుంది. సింపుల్‌గా స్టార్ట్ చేసిన కథను ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌గా దర్శకుడు మలిచిన తీరు బాగుంది.
వేరేవారి కలలో మనం ట్రావెల్ చేయడం.. అనే పాయింట్ చాలా కొత్తగా ఉంది. తెలుగు ప్రేక్షకులు ఈ పాయింట్ నచ్చుతుంది. సమయం – కాలం అనే రెండు పాయింట్లను టచ్ చేస్తూ ఈ చిత్ర కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. పరిమిత పాత్రలతో దర్శకుడు ఇలాంటి సినిమాను తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది.
మైనస్ పాయింట్స్ :
థ్రిల్లర్ చిత్రాలు ఎంత కొత్త పాయింట్‌తో వచ్చినా వాటి ఎగ్జిక్యూషన్లో తడబడితే ఫలితం మారిపోతుంది. ఈ సినిమాలో కూడా ఇదే జరిగింది. మంచి పాయింట్.. చక్కటి పర్ఫార్మెన్స్లు ఉన్నా, కథలో చాలా సీన్స్ రిపీటెడ్‌గా వస్తుండటంతో ప్రేక్షకులకు అసలేం జరుగుతుందో అర్థం కాదు.
ఇలాంటి కథను డీల్ చేయడమే కాదు.. ఆడియన్స్‌కు అర్థమయ్యేలా కూడా చెప్పాలి. ఈ విషయంలో దర్శకుడు తడబడ్డాడు. మంచి సస్సెన్స్‌తో వెళ్తున్న సినిమాను రిపీటెడ్ ఎపిసోడ్స్‌తో పక్కదారి పట్టించాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో తరుచుగా మనకు ఈ సీక్వెన్స్ కనిపిస్తుంది.
ఏదైనా సినిమాలో ఒకటి లేదా రెండు ఫ్లాష్‌బ్యాక్స్ ఓకే అనిపిస్తాయి.. కానీ ఈ సినిమాలో ప్రతిసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్తుండటంతో ప్రేక్షకులు ఏది కల, ఏది నిజం అనే అయోమయంలో పడిపోతారు. మంచి స్క్రీన్‌ప్లే ఉన్నా, కథను సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు. క్లైమాక్స్ కూడా ఆకట్టుకోదు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు రెజిన్ ఎస్ బాబు రాసుకున్న కథలో సరికొత్త పాయింట్ ప్రెజెంట్ చేశారు. అయితే, ఈ పాయింట్‌ను అందరికీ అర్థమయ్యేలా వివరించడంలో ఆయన తడబడ్డారు. థ్రిల్లింగ్ అంశాలకు స్కోప్ ఉన్నప్పటికీ, కన్ఫ్యూజన్తో సినిమాను ట్రాక్ తప్పించారు. అరుణ్ దామోదరణ్ సినిమాటోగ్రఫీ.. జీన్ పి.జాన్సన్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ బాగుంది.
తీర్పు :
ఓవరాల్‌గా, ‘పెండ్యులం’ మూవీలోని కొత్త పాయింట్, నటీనటులు పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే, కథలోని కన్ఫ్యూజన్, రిపీటెడ్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోవు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కు మంచి స్కోప్ ఉన్నా దానిని పూర్తిగా వినియోగించుకోలేదు. మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ సినిమాను ఓసారి ట్రై చేయవచ్చు. మిగతావారు ఇతర ఆప్షన్స్ చూసుకోవడం బెటర్.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team