
“అందాల రాక్షసి” ఫేం రాహుల్ మరియు “మేం వయసుకో వచ్చాం” ఫేం నీతి టేలర్ ప్రధాన పాత్రలలో “పెళ్లి పుస్తకం” అనే చిత్రం రానుంది. రామకృష్ణ మచ్చకంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మి నరసింహ సిని విజన్స్ పథకం మీద బి. నాగిరెడ్డి, బి వి గోపాల్, పి సుమన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.దర్శకులు బాపు గారి అనుమతి తోనే ఈ చిత్రానికి ఈ పేరుని ఎంచుకున్నామని దర్శకుడు తెలిపారు. పెళ్ళయిన ఓ జంట జీవితంలో ఎదుర్కున ఒడిదొడుకులను ఎలా ఎదుర్కున్నారు అన్నదే ఈ చిత్ర కథాంశం. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రంలో అలనాటి హిట్ సాంగ్ “శ్రీరస్తు…. శుభమస్తు” కూడా ఉంచనున్నట్టు దర్శకుడు తెలిపారు.ఈ నెల 30 వరకు ఈ చిత్ర షెడ్యూల్ జరుపనున్నారు.