మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో చేస్తున్న అవైటెడ్ చిత్రం పెద్ది కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ పాన్ ఇండియా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా మేకర్స్ చికిరి చికిరి అంటూ ఓ ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ ని చేసారు. ఇక దీనిపై అంతకు మించిన ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చి ఒక బ్లాక్ బస్టర్ చార్ట్ బస్టర్ ని ప్రామిస్ చేస్తున్నారు.
బుచ్చిబాబు, ఏ ఆర్ రెహమాన్ మధ్య ఇంట్రెస్టింగ్ మాటలు నుంచి సాంగ్ ప్రోమో తో ఇది స్యూర్ షాట్ హిట్ సాంగ్ అని కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇక రామ్ చరణ్ స్టెప్ కూడా ఇందులో అదిరింది అని చెప్పొచ్చు. ఇక ఈ సాంగ్ ని ఈ నవంబర్ 7న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.


