మొదటిసినిమాతోనే గ్లామర్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న పాయల్ ఆర్ డి ఎక్స్ లవ్ మూవీతో ఆ ఇమేజ్ ని మరోస్థాయికి తీసుకెళ్లింది. గత ఏడాది వెంకటేష్, నాగ చైతన్యల మల్టీస్టారర్ వెంకీ మామ సినిమాలో నటించి హిట్ అందుకుంది. ఐతే అందులో పాయల్ సెకండ్ హీరోయిన్ కావడంతో ఆ హిట్ ఆమె ఖాతలో చేరలేదు. అందం అభినయం ఉన్నా… పాయల్ నటించిన చాలా సినిమాలు ప్లాప్ కావడంతో ఆమెకు వరుసగా అవకాశాలు రావడం లేదు.
కాగా లాక్ డౌన్ టైం లో ఇంటిలో ఉంటున్న పాయల్ ఓ షార్ట్ ఫిల్మ్ తీసిందట. ఆ షార్ట్ ఫిల్మ్ ప్రత్యేకత ఏమిటంటే 24గంటల్లో పూర్తి చేశారట. అలాగే దీనిని పలు భాషలో విడుదల చేయనున్నారట. మరి పాయల్ నటించిన ఆ షార్ట్ ఫిల్మ్ దేని గురించో తెలియాలంటే ఇంకొద్దిరోజులు ఆగాల్సిందే. ఇక పాయల్ ఏంజెల్ అనే చిత్రంతో తమిళ్ ఎంట్రీ ఇవ్వనుంది. హర్రర్ కామెడీ జోనర్ లో వస్తున్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది.