కరోనా థియేటర్ల వ్యవస్థను పెద్దగా దెబ్బ తీయలేదు అని మొన్న రిలీజ్ అయిన సాయి తేజ్ సినిమాతో తేలిపోయింది. కరోనా ప్రవాహంలో కూడా థియేటర్లు ఫుల్ అవ్వడం నిజంగా విశేషమే. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ కు మాత్రం ఇంకా డిమాండ్ పెరుగుతూనే ఉంది. లాక్ డౌన్ మొదలైన దగ్గర నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రోజురోజుకూ జనంలోకి చొచ్చుకొని పోయాయి.
అందుకే జనం కూడా స్టార్ హీరో సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు. పైగా కొత్త కొత్త వెబ్ సిరీస్ లను కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్ లు జనంలోకి బాగా వెళ్లాయి. అందుకే కొందరు హీరోహీరోయిన్లు కూడా డిజిటల్ ఫిల్మ్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలో పాయల్ రాజ్ పుత్ ఒక షార్ట్ వెబ్ ఫిల్మ్ చేయబోతుంది. యంగ్ డైరెక్టర్ అవినాష్ కోకాటి చెప్పిన కథ పాయల్ కు బాగా నచ్చిందని.. అందుకే ఆమె వెబ్ ఫిల్మ్ చేయడానికి సన్నద్ధం అవుతుందని తెలుస్తోంది. ఇది ఒక ఎమోషనల్ సిరీస్ అని, మెయిన్ గా పాత్రల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని తెలుస్తుంది. ఇలాంటి కథాబలం ఉన్న వెబ్ సిరీస్ స్టోరీలో నటిస్తేనే తన ప్రతిభను కనబర్చడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందనే ఉద్దేశ్యంతో పాయల్ ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించిందట.