పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ, ఇదే ప్రూఫ్

పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ, ఇదే ప్రూఫ్

Published on Feb 5, 2020 6:53 AM IST

పవన్ కళ్యాణ్ మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రకటించారు.వాటిలో వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న పింక్ రీమేక్ షూటింగ్ జరుపుకుంటుండగా… దర్శకుడు క్రిష్ మూవీ చిత్రీకరణ ఇప్పుడే మొదలైంది. ఇక దర్శకుడు హరీష్ శంకర్ మూవీ మొదలుకావడానికి కొంత సమయం ఉన్నట్లు తెలుస్తుంది. ఐతే పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ మరోటి ఉంది, అదే త్రివిక్రమ్-పవన్. వీరిద్దరి సూపర్ హిట్ కాంబినేషన్, వీరిద్దరి కాంబినేషన్ లో మొత్తం మూడు చిత్రాలు రాగా వాటిలో జల్సా హిట్ అయితే.. అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక అజ్ఞాతవాసి వీరు కాంబినేషన్ లో వచ్చిన ప్లాప్ మూవీ.

కాగా మళ్ళీ వీరిద్దరూ కలిసి మూవీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కారణం గతంలో పవన్ కళ్యాణ్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత అయిన రాధా కృష్ణ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ఎన్నికల సమయంలో నామినేషన్ అఫిడవిట్ నందు తెలియజేయడం జరిగింది. కాబట్టి వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ రావడం అనేది పక్కాగా కనిపిస్తుంది. ఐతే పవన్ ఇప్పటికే మూడు సినిమాలు ఒప్పుకొన్నారు. వాటిని పూర్తి చేయడానికి కనీసం ఏడాది పైనే పడుతుంది. కనుక పవన్ తో త్రివిక్రమ్ మూవీ 2021లో ఉండే అవకాశం కలదు.

తాజా వార్తలు