రేసులోకి తిరిగి వచ్చిన వకీల్ సాబ్ !

రేసులోకి తిరిగి వచ్చిన వకీల్ సాబ్ !

Published on Nov 2, 2020 1:13 PM IST

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆయన పునరాగమన చిత్రం ‘వకీల్ సాబ్’ సంక్రాంతి పండుగకి రాబోతుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, డిసెంబర్‌లో మాత్రమే పవన్ ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు వార్తలు రావడంతో, వకీల్ సాబ్ సంక్రాంతి విడుదల ఇక సందిగ్ధంలో పడింది.

కానీ, పవన్ నిన్న వకీల్ సాబ్ షూటింగ్ తిరిగి ప్రారంభించాడు. దాంతో అందరికీ క్లారిటీ వచ్చింది, వకీల్ సాబ్ సంక్రాంతి రేసులో ఉందని. నిజానికి మధ్యలో అగకపోయి ఉంటే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయి ఎప్పుడో మేలోనే రిలీజ్ అయిపోయి ఉండేది. కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు ఈ సినిమా బాగా ఆలస్యం అయింది. పైగా పవన్ చేయాలనుకున్న సినిమాలన్నీ ప్రస్తుతానికి మధ్యలోనే ఆగాయి.

ఇక ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందట. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు అలాగే పవర్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్లు స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారట.

తాజా వార్తలు