కరోనాతో పవన్ ప్లానింగ్ మారింది !

కరోనాతో పవన్ ప్లానింగ్ మారింది !

Published on Jul 19, 2020 2:00 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ “పింక్’ తెలుగు రీమేక్ వకీల్ సాబ్, అలాగే క్రిష్ దర్శకత్వంలో మరో పిరియాడిక్ మూవీ చేస్తున్నాడు. కరోనా రాకపోయి ఉంటే ఈ పాటికి హరీష శంకర్ దర్శకత్వంలోనూ ఒక సినిమా మొదలయ్యేది. కానీ కరోనా రాకతో వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ఆగిపోవడం, పైగా ఇంకా షూట్ ఉండటం, దీనికి తోడు క్రిష్ సినిమాకి ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి రావడంతో మొత్తానికి పవన్ తరువాత చేయాలనుకున్న తరువాత సినిమాల పై ప్రభావం పడింది.

ఇప్పటికే పవన్ ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చే ఏడాదికి కూడా పూర్తయ్యేలా కనిపించడం లేదు. పవన్ 2022లో కూడా సినిమాలు చేసే ఆలోచనలో ఉండటంతో దర్శకుడు డాలీ పవన్ ను అప్రోచ్ అయ్యాడని, డాలీ దరకత్వంలో సినిమా చేయడానికి పవన్ నుండి సానుకూల స్పందనే వచ్చిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా ఇక లేనట్లే. కొత్త సినిమమాల విషయంలో పవన్ సానుకూలంగా స్పందించే అవకాశాలు తక్కువే. కరోనాతో పవన్ ప్లానింగ్ మొత్తం మారింది.

తాజా వార్తలు