కెమెరామెన్ గంగతో రాంబాబు ఆడియో విడుదల వాయిదా?


పరిశ్రమలో తిరుగుతున్న తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “కెమెరామెన్ గంగతో రాంబాబు” ఆడియో విడుదల మూడు రోజుల పాటు వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఈ చిత్ర ఆడియో సెప్టెంబర్ 21న విడుదల అవ్వాల్సి ఉండగా సెప్టెంబర్ 24కి వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి హాజరు కావడం కోసం ఈ తేదీని మార్చినట్టు తెలుస్తుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయిక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదల కానుంది.

Exit mobile version