పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా రాష్ట్ర రాజకీయ గొడవల కారణంగా మరోసారి వాయిదాపడింది. ఈ సినిమా ఆగష్టు 9న విడుదలకావాల్సివుంది. కానీ ఇప్పుడు ఆ తేదిన కుడా విడుదలకాదని స్పష్టమయ్యింది. విడుదల తేదిని త్వరలోనే తెలియజేస్తారు
‘అత్తారింటికి దారేది’ సినిమా సెన్సార్ బోర్డు దగ్గరనుంచి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ అందుకున్న విషయం తెలిసినదే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. సమంత ఒక అందమైన పాత్రలో హీరోయిన్ గా కనిపిస్తుంది
బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మించారు. ఈ వాయిదా వార్త పవన్ అభిమానులను నిరాశ పరిచినా కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తారని ఆశిద్దాం