కొత్త రికార్డ్ సృష్టించిన పవన్ ‘అత్తారింటికి దారేది’

AD1
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఒక ప్రత్యేకమైన కొత్త రికార్డ్ ను సృష్టించింది. ఈ సినిమాకి సంబందించిన వీడియోని ఒక్క మా టీవీ యుట్యూబ్ లోనే 25లక్షల మంది వీక్షించడం జరిగింది. ఇంతవరకు ఏ తెలుగు సినిమాని ఇంతమంది చూడలేదు. పవన్ కళ్యాణ్ స్టార్ పవర్, సమంత గ్లామరస్, త్రివిక్రమ్ రైటింగ్ స్కిల్స్ ఈ సినిమాకి పెద్ద అట్రాక్షన్. ఈ సినిమాని ఆనందంగా సాగే ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించారని సమాచారం. ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వారి సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు సద్దుమనిగితే ఈ సినిమాని ఆగష్టు 21న విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి కోట శ్రీనివాస రావు, బోమన్ ఇరానీ, నదియ, బ్రహ్మానందం, అలీ మొదలగు వారు నటించారు.

Exit mobile version